మెగాస్టార్ చిరంజీవి – బాబీ కొల్లి కాంబినేషన్లో ఓ సినిమా రాబోతుంది. చిరంజీవి కెరీర్లో 158వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమా అప్ డేట్ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ మూవీలో చిరంజీవి నటించే పాత్రల పై క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. చిరంజీవి రెండు వేర్వేరు పాత్రల్లో కనిపిస్తారట. తండ్రి పాత్రలో, అలాగే కొడుకు పాత్రలో కూడా మెగాస్టార్ కనిపించనున్నారని రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో చూడాలి. మొత్తానికి ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.
పైగా ఈ సినిమాలో మెగాస్టార్ పాత్రల్లో చాలా వేరియేషన్స్ ఉంటాయట. అలాగే, ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రధానంగా ఉంటాయని తెలుస్తోంది. స్టోరీ కూడా ప్రత్యేకంగా ఉంటుందట. చిరును కొత్తగా చూపించాలనే ఉద్దేశ్యంతో ఈ కథ రాసుకున్నారట బాబీ. కాగా ఈ సినిమాని KVN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాతలు వెంకట్ కె నారాయణ, లోహిత్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. కాగా గతంలో చిరు, బాబీ కాంబినేషన్లో వచ్చిన వాల్తేరు వీరయ్య మంచి విజయం సాధించింది.
