‘కొరియన్ కనకరాజు’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. 3 రోజుల్లోనే ?

వరుణ్ తేజ్ మొత్తానికి ‘కొరియన్ కనకరాజు’తో ఘన విజయాన్ని అందుకున్నారు. హారర్-కామెడీగా వచ్చిన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ లభించడమే కాకుండా, ప్రేక్షకుల నుంచి వచ్చిన మంచి ఆదరణ బాక్సాఫీస్ వద్ద కూడా అద్భుతమైన ఫలితాలకు దారితీసింది. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం, ఈ చిత్రం విడుదలైన మొదటి వారాంతంలో ప్రపంచవ్యాప్తంగా రూ. 35 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. అంతకంటే ముఖ్యంగా, కేవలం మూడు రోజుల్లోనే అన్ని ప్రాంతాల్లోనూ బ్రేక్-ఈవెన్ సాధించడం మరో విశేషం.

అటు వారాంతం తర్వాత కూడా ఈ సినిమా జోరు ఇంకా కొనసాగుతోంది, ఈ రోజు సోమవారం నాడు కూడా బలమైన బుకింగ్స్ నమోదవుతున్నాయి. అమెరికాలో ఈ చిత్రం $500K మార్కుకు చేరువలో ఉంది. ప్రస్తుత కలెక్షన్స్ ఇలాగే కొనసాగితే $1 మిలియన్ మైలురాయిని కూడా అందుకునే అవకాశం ఉంది. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా యంగ్ హీరోయిన్ రితికా నాయక్ వరుణ్ తేజ్ సరసన నటించింది. ఈ చిత్రంలో సత్య, శ్రీనివాస్ అవసరాల, మురళీధర్ గౌడ్, చిన్న తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Exit mobile version