‘విశ్వంభర’ ఊసే తీయని మెగాస్టార్.. క్లారిటీ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్!

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా తన కెరీర్ 158వ సినిమాని దర్శకుడు కొల్లి బాబీ కలయికలో చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రంకి ముందే ఆల్రెడీ ఈ ఏడాదిలో మన శంకర వర ప్రసాద్ గారు అనే సినిమాతో చిరు రీజనల్ ఇండస్ట్రీ హిట్ కూడా ఇచ్చారు. కానీ ఈ రెండు సినిమాల కంటే ముందే మొదలైన ఓ భారీ ఫాంటసీ సినిమా విషయంలో మాత్రం ఇప్పటికీ క్లారిటీ మిస్ కావడంతో అభిమానులలో గందరగోళం నెలకొంది.

నిన్న కొరియన్ కనకరాజు సక్సెస్ ఈవెంట్ లో మెగాస్టార్ తన 158వ సినిమా కోసం మాట్లాడారు కానీ విశ్వంభర నుంచి ఏ చిన్న లీక్ రాలేదు. పైగా కొరియన్ కనకరాజు నిర్మాణ సంస్థల్లో ఒకటైన యూవీ క్రియేషన్స్ వారే ఈ సినిమాకి కూడా చేశారు. అయినప్పటికీ విశ్వంభర కోసం సస్పెన్స్ నే ఆఖరికి మిగిలింది. దీనితో అభిమానులు ఒక తుది క్లారిటీ కోసం ఎదురు చూస్తున్నారు. మరి అది మెగాస్టార్ పుట్టినరోజుకే అంటే ఆగష్టు 22కే ఏమన్నా వస్తుందేమో చూడాలి.

Exit mobile version