మరో ట్రాన్స్‌ఫార్మేషన్‌లోకి రామ్ చరణ్..?

ram-charan

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన కొత్త సినిమా ‘RC17’ కోసం సరికొత్త రూపంలోకి మారడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు సుకుమార్ తెరకెక్కించనున్న ఈ సినిమా కోసం ఆయన దాదాపు 15 కిలోల బరువు తగ్గి, స్లిమ్‌గా కనిపించబోతున్నాడట. అంతేకాకుండా ఈ పాత్ర కోసం పొడవాటి జుట్టును కూడా పెంచనున్నాడట.

ఈ చిత్రాన్ని పాన్-ఇండియా స్థాయిలో పెద్ద ఎత్తున తెరకెక్కించేందుకు సుకుమార్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేస్తున్నాడు. ఇప్పటికే మొదటి భాగం కథ పూర్తవ్వగా, క్లైమాక్స్ పై ప్రస్తుతం పని చేస్తున్నాడు. చేతి గాయం నుంచి కోలుకున్న వెంటనే రామ్ చరణ్ ఈ సినిమా కోసం బరువు తగ్గే ట్రెయినింగ్ ప్రారంభిస్తాడట.

Exit mobile version