కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తెరకెక్కించిన భారీ యాక్షన్ చిత్రమే ‘టాక్సిక్’. యష్ నుంచి ఎన్నో ఏళ్ళు తర్వాత వస్తున్న ఈ సినిమా కోసం అభిమానులు మాత్రం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ చిత్రాన్ని మేకర్స్ పాన్ వరల్డ్ లెవెల్లో ప్లాన్ చేస్తుండగా ఈ సినిమా రిలీజ్ హైప్ బుక్ మై షోలో అయితే తారాస్థాయిలో ఉంది.
లేటెస్ట్ గా ఈ సినిమా బుక్ మై షోలో 1 మిలియన్ ఇంట్రెస్ట్ లను నమోదు చేసి ఇండియన్ సినిమా దగ్గర రేర్ ఫీట్ సెట్ చేసిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. దీనితో ఆన్లైన్ లో హైప్ బాగానే ఉంది అనుకోవచ్చు కానీ రియాలిటీకి వస్తే మాత్రం అంత రేంజ్ లో ఎక్కడా కనిపించడం లేదు. ముందు ఉన్నంత ఎగ్జైట్మెంట్ పాన్ ఇండియా మార్కెట్ లో టాక్సిక్ కి లోపించింది అని చెప్పక తప్పదు. సో వీటిని బ్రేక్ చేసి ఊహించని ఓపెనింగ్స్ ని సినిమా సెట్ చేస్తుందో లేదో తెలియాలి అంటే ఈ 26 వరకు ఆగాల్సిందే.
The Nation is gearing up for a Massive dose of Intoxication💥#ToxicTheMovie smashes past 1 Million+ Interests on @bookmyshow. Nationwide Bookings open tomorrow🎟🔥#ToxicOn26thAug pic.twitter.com/eUuzCxCW2N
— TOXIC (@Toxic_themovie) August 20, 2026
