టాక్సిక్ : ఓటీటీ డీల్ పై యష్ తప్పటడుగు.. ఇప్పుడేం చేస్తాడో..?

‘కేజీఎఫ్’ ఫ్రాంచైజీ ఘన విజయం తర్వాత హీరో యష్ క్రేజ్ పీక్స్ కి చేరుకుంది. ఆ భారీ విజయం తర్వాత సుమారు నాలుగేళ్ల విరామం తర్వాత ఆయన నటించిన చిత్రం ‘టాక్సిక్’. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండటంతో కేవీఎన్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కించింది. అయితే సినిమా విడుదల కాకముందే డిజిటల్ రైట్స్‌పై భారీ ఆశలు పెట్టుకున్నప్పటికీ, మేకర్స్ అడిగిన భారీ మొత్తానికి, ఓటీటీ దిగ్గజాలు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ సంస్థలు వెనకడుగు వేశాయి.

​ఆ తర్వాత జీ స్టూడియోస్ ముందుకు వచ్చినప్పటికీ, ఆఫర్ చేసిన ధర తక్కువగా ఉందనే కారణంతో యష్ ఆ డీల్‌ను తిరస్కరించారు. సినిమా హిట్టయ్యాక పెద్ద మొత్తాలు వస్తాయని ఆయన నమ్మినప్పటికీ, సినిమాకు డిజాస్టర్ టాక్ రావడంతో ఆ వ్యూహం బెడిసికొట్టింది.

ప్రస్తుతం కోలుకోలేని నష్టాలను ఎదుర్కొంటున్న ఈ చిత్రంతో యష్ తన రెమ్యునరేషన్ మరియు లాభాల వాటాలో కోల్పోయిన పెట్టుబడిని తిరిగి చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి టాక్సిక్ ఏ ఓటీటీ లోకి వస్తుందో వేచి చూడాలి.

Exit mobile version