కన్నడ స్టార్ హీరో, అభినయ చక్రవర్తి కిచ్చా సుదీప్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు ఒక భారీ కింగ్-సైజ్ సర్ప్రైజ్ లభించింది. విజయనగర సామ్రాజ్య వైభవాన్ని ఎలుగెత్తి చాటిన చారిత్రక చక్రవర్తి శ్రీ కృష్ణదేవరాయల పాత్రలో సుదీప్ నటించబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
‘దేవరాయ’ అనే పవర్ఫుల్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ పాన్-ఇండియా ప్రాజెక్ట్‌ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరియు సుప్రియ్యాన్వి పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. గౌర హరి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ పీరియాడికల్ విజువల్ వండర్ 2027 డిసెంబర్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానున్నట్లు మేకర్స్ వెల్లడించారు.
ఒక యుగాన్ని శాసించిన రాజుగా సుదీప్ నటిస్తుండటంతో ఈ చిత్రంపై అప్పుడే భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, ఈ చిత్రానికి దర్శకత్వం ఎవరు వహిస్తున్నారనే విషయాన్ని మేకర్స్ రివీల్ చేయకపోవడం గమనార్హం.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
