‘ఎల్లమ్మ’లో హీరోయిన్ ఫిక్స్.. ఎవరంటే..?

టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు, రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘ఎల్లమ్మ’. ‘బలగం’ ఫేమ్ వేణు యెల్దండి దర్శకత్వంలో తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో ప్యూర్ లవ్ స్టోరీగా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ షూటింగ్ ప్రారంభం కాగా, ఇటీవల దేవి శ్రీ ప్రసాద్ కూడా సెట్స్‌లో జాయిన్ అయ్యాడు.

అయితే, ఈ చిత్రంలో హీరోయిన్ పాత్ర కోసం సాయి పల్లవి, కీర్తి సురేష్ వంటి పలువురు స్టార్స్ పేర్లు ప్రచారంలోకి వచ్చినా మేకర్స్ ఎవరినీ అధికారికంగా ఖరారు చేయలేదు. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాలో దేవి శ్రీ ప్రసాద్ సరసన నటించే హీరోయిన్‌గా యువ నటి అనంతిక సనిల్‌కుమార్ ఎంపికైనట్లు తెలుస్తోంది. కథలో పాత్రకు ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా ఆమె అయితేనే సరిగ్గా సరిపోతుందని భావించిన దర్శకనిర్మాతలు అనంతికను ఫైనల్ చేశారట.

దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ స్వయంగా సంగీతం అందిస్తుండగా, ఈ సినిమాను 2027 వేసవి కానుకగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Exit mobile version