‘ఆర్ ఎక్స్ 100’ చిత్రంతో టాలీవుడ్‌లో సరికొత్త క్రేజ్ సొంతం చేసుకున్న యువ నటుడు కార్తికేయ. ఆ తర్వాత ‘గుణ 369’, ‘గ్యాంగ్ లీడర్’, ‘వలిమై’, ‘బెదురులంక 2012’ వంటి వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులను మెప్పించాడు. అయితే 2024లో వచ్చిన ‘భజే వాయు వేగం’ సినిమా తర్వాత ఆయన మరో ప్రాజెక్ట్‌ను ప్రకటించలేదు.
గత రెండేళ్లుగా నటనకు దూరంగా ఉండటంతో, ఆయన తర్వాతి చిత్రం గురించి ఎలాంటి వార్తలు రాకపోవడంతో అభిమానుల్లో రకరకాల సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే కార్తికేయ ఈ లాంగ్ గ్యాప్‌లో తన సొంత కథపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇకపై కేవలం నటుడిగానే కాకుండా దర్శకుడిగానూ తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యాడు.
ఆయన నటిస్తూ, దర్శకత్వం వహించనున్న ఈ కొత్త చిత్రం ఈరోజే పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై రూపుదిద్దుకుంటున్న ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు. వచ్చే నెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
