సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరగా దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘జైలర్ 2’ తెలుగు డిస్ట్రిబ్యూషన్ హక్కులకు సంబంధించి ఒక బిగ్ అప్‌డేట్ వెలువడింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఈ చిత్రం థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సొంతం చేసుకుంది.
సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ ఈ భారీ సీక్వెల్‌ను నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ యాక్షన్ డ్రామాపై రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విపరీతమైన క్రేజ్ ఉంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ భాగస్వామ్యంతో తెలుగులో ఈ సినిమా అత్యంత గ్రాండ్‌గా, రికార్డు స్థాయిలో థియేటర్లలో విడుదలయ్యేందుకు మార్గం సుగమమైంది.
ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం అక్టోబర్ 15, 2026న ప్రేక్షకు ముందుకు రాబోతోంది. ఈ సినిమాతో రజినీకాంత్ మరోసారి రికార్డులతో చెడుగుడు ఆడటం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.
