విలక్షణ నటుడు, సంగీత దర్శకుడు విజయ్ ఆంటోనీ ప్రధాన పాత్రలో రూపొందుతున్న తాజా చిత్రం ‘నాన్న కుట్టి’ విడుదల తేదీ ఖరారైంది. ఈ చిత్రాన్ని అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఈ చిత్రానికి విజయ్ ఆంటోనీ స్వయంగా సంగీతం అందిస్తుండటం విశేషం. ము మారన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రీతి, హరిప్రియ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
విజయ్ ఆంటోనీ ఫిలింస్ బ్యానర్‌పై భారీ నిర్మాణ విలువలతో తెరకెక్కుతున్న ఈ సినిమా, అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తుందని చిత్రబృందం ధీమా వ్యక్తం చేస్తోంది.
