విక్టరీ వెంకటేష్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించనున్న ‘ఓ మై గాడ్’ రీమేక్ లో నయనతార నటించనుందా.? అనే వార్త ప్రస్తుతం ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే ‘రాధా’ సినిమాలో వెంకటేష్ సరసన నయనతార నటించనుంది.
ప్రస్తుతం ‘రాధా’ సినిమా కాస్త పక్కన పెట్టడం వల్ల వేకంతేష్ ఓ మై గాడ్ రీమేక్ లో నటించనున్నాడు. డివివి దానయ్య దగ్గర నయనతార డేట్స్ ఉన్నాయి అవి ‘ఓ మై గాడ్’ మేకర్స్ కి అందించనున్నట్లు సమాచారం. కానీ ఈ వార్తా ఇంకా ఖరారు కాలేదు.
సురేష్ బాబు – శరత్ మరార్ కలిసి నటించనున్న ఈ సినిమాకి డాలీ దర్శకత్వం వహించే అవకాశం ఉంది. మే నుంచి ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది.


