దాసరిపై ధ్వజమెత్తిన ప్రకాష్

దాసరిపై ధ్వజమెత్తిన ప్రకాష్

Published on Apr 15, 2014 4:13 AM IST

Dasari-Narayana-rao
దర్శకరత్న దాసరి నారాయణరావు మళ్ళీ సమస్యల సుడిగుండంలో ఇరుక్కున్నట్టు తెలుస్తోంది. మాజీ కోల్ యూనియన్ మినిస్టర్ అయిన దాసరిని బొగ్గు కుంభకోణంలో సిబిఐ వారు విచారించారు. అలాగే కొన్ని గంటల పాటు ఆయన్ని పర్సనల్ గా విచారించి స్టేట్మెంట్స్ తీసుకున్నారు.

ఆ విచారణ తర్వాత పెద్దగా సమస్యలేమీ రాలేదు. అంతా సవ్యంగా ఉందనుకున్న ఈ సమయంలో కోల్ మినిస్ట్రీ లో పనిచేసిన మాజీ సెక్రెటరీ పిసి ప్రకాష్ నుంచి దాసరికి సమస్య ఎదురైంది.

ప్రకాష్ దాసరి నారాయణరావు, శిబు సోరెన్ బొగ్గు కుంభకోణంలో భారీగా అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. అడ్మినిస్ట్రేషన్, ఇతర విభాగాలలో చాలా తప్పు చేసారని ప్రకాష్ ఆరోపించాడు. అలాగే ప్రధాని మన్మోహన్ సింగ్ పై కూడా తీవ్రమైన ఆరోపణలు చేసాడు.

ఇప్పటి వరకూ అయితే దాసరి ఈ విషయంపై ఇంకా ఎలాంటి కామెంట్స్ చేయలేదు. దాసరి ఎలా స్పందిస్తాడా అని అందరూ ఎదురు చూస్తున్నారు.

తాజా వార్తలు