కేర్ తీసుకుంటున్న రవితేజ.. ఫ్యామిలీ ఆడియెన్స్ మార్కెట్ టార్గెట్?

కేర్ తీసుకుంటున్న రవితేజ.. ఫ్యామిలీ ఆడియెన్స్ మార్కెట్ టార్గెట్?

Published on Apr 26, 2026 10:02 PM IST

ఒకప్పుడు ఎలాంటి నెగిటివిటీ లేకుండా మన తెలుగు ఆడియెన్స్ లో అంతా ఎంతో ఇష్టపడే హీరోల లిస్ట్ లో మాస్ మహారాజ రవితేజ పేరు కూడా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి వేరేలా మారిపోయింది. వీటికి దూరంగా మాస్ మహారాజ్ తీసుకుంటున్న కేర్ మరింత ఎక్కువ అయినట్టే అనిపిస్తుంది.

కొన్ని మాస్ అండ్ ప్రయోగాత్మక సినిమాలు తర్వాత భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో వచ్చిన రవితేజ దాని తర్వాత ఇరుముడి అనే ఎమోషనల్, డివోషన్ టచ్ తో కూడిన సబ్జెక్టు పట్టుకున్నారు. ఇది కూడా ఫ్యామిలీ ఆడియెన్స్ కి న్యూట్రల్ ఆడియెన్స్ కి దగ్గరయ్యే స్టెప్పే కాగా ఇక వీటి తర్వాత యువ దర్శకుడు హసిత్ గోలితో ఇంకో సాలిడ్ ఎంటర్టైనర్ ఇది కూడా ఫ్యామిలీ ఆడియెన్స్ టార్గెట్ గానే సెట్ చేసినట్టు తెలుస్తుంది.

రాజ రాజ చోర, స్వాగ్ చిత్రాలతో ఎంటర్టైన్మెంట్ తో పాటుగా మంచి ఎమోషన్స్ ని కూడా హషిత్ చూపించి మెప్పించాడు. ఇప్పుడు ఇదే దర్శకునితో సినిమా ఉందని వినిపిసున్న బజ్, పైగా ఫ్యామిలీ ఆడియెన్స్ కి కనెక్ట్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నట్టు రావడం అనేది మరింత ఆసక్తి పెంచింది. సో ఈ ఇంట్రెస్టింగ్ కలయికపై మరిన్ని డీటెయిల్స్ బయటకి రావాల్సి ఉంది.

తాజా వార్తలు