ఈ సారీ నేనూ ఓటు వేస్తా – చార్మీ

ఈ సారీ నేనూ ఓటు వేస్తా – చార్మీ

Published on Apr 17, 2014 8:31 AM IST

charmi
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ వెలుగులో ఉండేది చాలా తక్కువ టైం అనే చెప్పుకోవాలి. కానీ చార్మింగ్ బ్యూటీ చార్మీ 12 ఏళ్ళుగా హీరోయిన్ గా కొనసాగుతూ 49 సినిమాల్లో నటించింది. తను చేసిన 50వ సినిమా ‘ప్రతిఘటన’. ఈ 50 సినిమాల్లో కేవలం గ్లామర్ డాల్ రోల్స్ ఏ కాకుండా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ నటించి మంచి పేరు తెచ్చుకుంది. తమ్మారెడ్డి భరద్వాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ శుక్రవారం అనగా ఏప్రిల్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమా చేయడం వాళ్ళ మీరు ఏమేమి నేర్చుకున్నారని చార్మీని అడిగితే ‘ నా జీవితంలో ఇప్పటి వరకూ ఓటు వేయలేదు. కానీ ఈ సారి ఎన్నికల్లో తప్పకుండా ఓటు వేస్తా, ఎందుకంటే ఓటు హక్కు వినియోగించుకోవడం ఎంత ముఖ్యమో నాకు ఈ సినిమా చేసేటప్పుడే అర్థమైందని’ చెప్పింది.

అలాగే పెళ్లి గురించి చెబుతూ ‘పెద్దల కుదిర్చిన వివాహం అంటే కష్టమే ఎందుకంటే అతను ఎలాంటి వాడో మనకు తెలియదు. కావున బాగా తెలిసిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటాను.కనీ పెళ్లి చేసుకోవాలి అనిపించేలా ఇంకా ఒక వ్యక్తి కూడా తారసపడలేదని’ తెలిపింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు