శంకర్ – విక్రమ్ ల ‘ఐ’ ఆడియోకి రానున్న ఆర్నాల్డ్?

శంకర్ – విక్రమ్ ల ‘ఐ’ ఆడియోకి రానున్న ఆర్నాల్డ్?

Published on Apr 20, 2014 12:40 PM IST

vikram
సౌత్ సూపర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ శంకర్ ప్రస్తుతం విక్రమ్ చేస్తున్న సినిమా ‘ఐ’. ఈ సినిమాని తెలుగులో

‘మనోహరుడు’గా రిలీజ్ చేయనున్నారు. హాలీవుడ్ టెక్నీషియన్స్ తో హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కించారు. ఈ సినిమా ఆడియో రిలీజ్ విషయం గురించి మేము విన్న వార్త నిజమైతే ఈ వేడుకకి ఓ ఫేమస్ హాలీవుడ్ స్టార్ ముఖ్య అతిధిగా హాజరుకానున్నాడని కోలీవుడ్ సమాచారం.

అది ఎవరో కాదు ‘టెర్మినేటర్’ సినిమా ద్వారా ఇండియన్ ఆడియన్స్ కి బాగా పరిచయం ఉన్న ఆర్నాల్డ్. ఆర్నాల్డ్ ఈ సినిమా ఆడియో వేడుకకి రానున్నాడని కోలీవుడ్ విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఏప్రిల్ చివరిలో సినిమా ఆడియోని రిలీజ్ చేసి మే లో సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. విక్రమ్ సరసన అమీ జాక్సన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి ఎఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించగా, పిసి శ్రీరాం సినిమాటోగ్రాఫర్ గా పనిచేసాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు