
సౌంత్ ఇండియన్ సూపర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ శంకర్ అంటేనే భారీ బడ్జెట్ చిత్రాలు, భారీ భారీ సెట్టింగ్స్ గుర్తొస్తాయి. పాటల కోసం కూడా భారీ భారీ సెట్టింగులను వేయిస్తుంటాడు, అలాంటి సెట్టింగులనే మనం శివాజీ, రోబో సినిమాలలో చూడొచ్చు.
ప్రస్తుతం శంకర్ డైరెక్ట్ చేసిన సినిమా ‘మనోహరుడు’. ఈ సినిమాలో ఓ పాట కోసం అక్షరాల 5 కోట్లు ఖర్చు పెట్టించారు. అది కూడా హీరోపై వచ్చే పాట కోసం కాకపోవడంతో అందరూ షాక్ అవుతున్నారు. ఈ మూవీ హీరోయిన్ అమీ జాక్సన్, విలన్ పాత్ర చేస్తున్న ఉపేన్ పటేల్ పై వచ్చే పాట ఇంత డబ్బు ఖర్చు పెట్టారు. ఈ పాటని సెట్టింగ్స్ లో కాకుండా చైనా నుంచి చెన్నై వరుకు ఉన్న బ్యూటిఫుల్ లోకేషన్స్ లో షూట్ చేసారు.
విక్రమ్ ద్విప్రాభినయంలో కనిపించనున్న ఈ సినిమాకి ఎఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. మే లో ఈ మూవీ రిలీజ్ కావడానికి సిద్దమవుతోంది.

