టాంటెక్స్సాహిత్యవేదిక పై తెలుగువెన్నెల కురిపించిన ఉగాది కవి సమ్మేళనం : ఘనంగా ముగిసిన 81 వ సదస్సు

టాంటెక్స్సాహిత్యవేదిక పై తెలుగువెన్నెల కురిపించిన ఉగాది కవి సమ్మేళనం : ఘనంగా ముగిసిన 81 వ సదస్సు

Published on Apr 24, 2014 3:53 PM IST

Tamtex-(1)

ఏప్రిల్ 20, 2014, డాల్లస్/ఫోర్టువర్త్, టెక్సస్

ఉత్తరటెక్సస్ తెలుగుసంఘం (టాంటెక్స్) సాహిత్యవేదిక సమర్పించిన “నెలనెలాతెలుగువెన్నెల” 81 వసదస్సు ఆదివారం, ఏప్రిల్ 20వ తేది స్థానిక డీ.ఎఫ్.డబ్ల్యూ. హిందూ దేవాలయ ప్రాంగణంలో సాహిత్యవేదిక సమన్వయకర్త ఆదిభట్ల మహేష్ ఆదిత్య అధ్యక్షతన నిర్వహించబడినది. డాల్లస్ పరిసర ప్రాంత భాషాభిమానులు, సాహితీ ప్రియులు అధిక సంఖ్యలో అత్యంత ఆసక్తితో ఈ సమావేశానికి హాజరయి జయప్రదంచేసారు. ప్రవాసంలో నిరాటంకంగా 81 నెలల పాటు ఉత్తమ సాహితీ వేత్తల నడుమ సాహిత్య సదస్సులు నిర్వహించడం ఈసంస్థ విశేషం.స్థానిక చిన్నారి వాస్కర్ల శ్రియ శ్రావ్యంగా “సాధుసుజనతో షిణి” గీతం ఆలపించి సభను ప్రారంభించడం జరిగింది. ఉగాది సందర్భంగా జరిగిన కవిసమ్మేళనాన్ని స్థానిక చిన్నారి కస్తూరి ప్రణవ్చంద్ర, అల్లసాని పెద్దన రాసిన మను చరిత్ర నుండి “ప్రవరాఖ్యుడుహిమశైలం” గురించివివరిస్తున్న పద్యం శ్రావ్యంగా వినిపించి ప్రారంభించడం గమనార్హం.

సాహిత్య వేదిక సమన్వయ కర్త ఆదిభట్ల మహేష్ ఆదిత్య స్వాగాతోపన్యాసంలో తమ స్వీయ కవిత “ఉగాది.కాం” వినిపించి జయనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో సాహితీ ప్రియులందరికీ కవి సమ్మేళనానికి స్వాగతం పలికారు. కస్తూరి గౌతంచంద్ర నేటి యువతరం ఈ కార్యక్రమంలొ పాల్గొనడం చాల అనందదాయకం అని కొనియాడుతూ గుర్రం జాషువ గారి “బుద్ధదేవునిపునరాహ్వానం” నుంచి రెండు పద్యాలు వినిపించారు. శ్రీమతి పాలూరి సుజన తమ కవితలో “ఎన్నికలలో ఎన్నికలలో “ప్రస్తుత ఎన్నికల వాతవరణం మీద లీటెర్ పెట్రోలు కొన్నవారికి స్కూటెర్ ఫ్రీ అన్నట్లు వంటి చెణుకులతో చక్కని కవిత చదివి అందరినీ ఆకట్టుకున్నారు.
ఆచార్య పూదూర్జగదీశ్వరన్ టాంటెక్స్ ఉగాది పురస్కారాల మీద ఆశువుగా రాసిన పద్యాలు కమ్మగా పాడి అలరించారు. డా. గన్నవరపునరసింహమూర్తి స్వీయ రచన “వసంతం” వర్ణిస్తూ “గగన తారల తలపు గరికపూలు” అంటూ వసంత కాలంలొ పూచే టెక్సాస్ గడ్డి పూవులని వర్ణించారు. నెల్సన్ మండేలాను ఉద్దేశించిరాసిన “నల్లసింహం” కవితను “నల్ల సింహము విదిలించె నల్ల జూలు..తెల్ల ఏనుగు భీతిల్లి తల్లడిల్ల” అంటూ ముగించారు
.
డా.జువ్వాడిరమణ, ఆదికవి నన్నయ పద్యం చక్కగా పాడి అందరి మన్ననలు పొందారు. సాహిత్య వేదిక సభ్యుడు నిమ్మగడ్డ రామకృష్ణ “మధుమాసమిదేలే!” అనే స్వీయ కవితని చదివి వినిపించారు. మల్లవరపు అనంత్ కాల ప్రవాహంలొదాచుకున్నకవితను దుమ్ముదులిపి తెచ్చానుమీకోసం అంటూ గతంలొ తాను రచించిన కవిత “కాలప్రవాహం” చదివివినిపించారు. కొండ శ్రీకాంత్రెడ్డి, శ్రీనాధు నిచాటువు చదివి వినిపించారు. మద్దుకూరి విజయచంద్ర హాస్ స్వీయ కవిత “అదే” చదివి వినిపించారు. ఏలూరు వాస్తవ్యులు, రిటైర్డ్ తెలుగు అధ్యాపకులు శ్రీపి. శివ శంకర్రావ్ టాంటెక్స్ సాహిత్య వేదికపై తాము రచించిన స్వీయ కవిత వినిపించి, ప్రవాసాంధ్రులలో తెలుగు సాహిత్యాభిమానం గురించి ప్రసంగించారు. ఆయలూరి బస్వి”తెలంగాణాలోతెలుగుసాహిత్యం” అనే అంశం మీద చక్కని సమీక్షను జనరంజకముగా సాహితీ ప్రియులతో పంచుకున్నారు.
కుందేటి చక్రపాణి “ఈగాలి , ఈనేల ఈవూరు సెలయేరు” అంటూ చక్కని పాటపాడి శ్రవణానందం కలిగించారు. సాహిత్య వేదిక సభ్యుడు పున్నం సతీష్ “ఉగాది అదిగొ అరుదెంచె” అనే వడ్డేపల్లి క్రిష్ణగారి ఉగాది కవితతో ఆరంభించి ఈమాసంలొ పుట్టిన మహనీయులు కొందరిని తలుస్తూ, హితకరిణి సంస్థస్థాపకులు, గద్య తిక్కన బిరుదాంకితుడైన కందుకూరి వీరేశలింగం గురించి”మాసానికో మహనీయుడు “శీర్షికలొ వివరించారు. సాహిత్య వేదిక సభ్యుడైన బసాబత్తిన శ్రీనివాసులు, మహాకవి శ్రీశ్రీకవితలు కొన్ని చదివారు. టెంపుల్, టెక్సాస్ నుంచి విచ్చేసిన డా. వెంకటరాజు తాను రచించిన “ఉగాదిశుభాకాంక్షలు” మరియు “తెలంగాణ జయోస్తు” అనే కవితలను ఆహ్వానితులతో పంచుకున్నారు.

సాహిత్య వేదిక సభ్యురాలు శ్రీమతి శారదసింగిరెడ్డి “మాతృభాష – మధురత్వం” అనే స్వీయ రచనను మధురంగా పంచుకున్నరు. టాంటెక్స్ఉత్తరాధ్యక్షులు డా. ఊరిమిండి నరసింహారెడ్డి ‘తెలుగువేదం’ మరియు ‘కవిహృదయం’ నుంచి ప్రత్యేకంగా ఎంచుకున్న కొన్ని కవితలతో పాటు, మహిళలను ఉత్తేజపరచడానికి తాను పొడుపు కథలు ఎంచుకున్నాను అని అందరి మెదడుకు పదునుపెట్టి ఆకట్టుకుంటూ “ఉగాది ప్రసాదం” వడ్డించారు. విరామంలో స్థానిక విందు రెస్టారెంట్ వారందించిన వేడి, వేడిఅల్పాహారం (పునుగు) మరియు తేనీరు అందరూ స్వీకరించారు. బొబ్బట్లు, ఉప్పుకారంతో పచ్చిమామిడి ముక్కలు ఉగాదికి గుర్తుగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.టాంటెక్స్ అధ్యక్షుడు కాకర్ల విజయ్మోహన్ మాట్లాడుతూ ఉగాది కవి సమ్మేళనం 81వ సదస్సులో అత్యంత ఆసక్తికరంగా జరగడం, ఇంత మంది సాహితీ ప్రియులు హాజరు కావటం తమకు ఆనందంగా వుంది అని వ్యక్త పరిచారు. టాంటెక్స్ సంస్థ పాలకమండలి సభ్యుడు డా. సి.ఆర్.రావు, తక్షణ పూర్వాధ్యక్షుడు మండువ సురేష్, కార్యదర్శి ఉప్పలపాటి కృష్ణా రెడ్డి, కోశాధికారి వీర్ణపుచిన సత్యం, కార్యవర్గ సభ్యులు శ్రీమతి వనంజ్యోతి, చామకూర బాల్కి మరియు సాహిత్య వేదిక బృంద సభ్యులు శ్రీమతి అట్లూరి స్వర్ణ, బండారు సతీష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సభను ముగించే ముందు తెలుగు సాహిత్య వేదిక కార్యవర్గ బృందం వందన సమర్పణ చేస్తూ ఉగాది కవి సమ్మేళ నంపూర్తిస్తాయిలో చక్కగా జరిగినందుకు సంతోషిస్తూ కార్యక్రమానికి విచ్చేసిన వివిధ సాహితీ ప్రియులకు, వేదిక కల్పించిన డీ.ఎఫ్.డబ్ల్యూ హిందూ దేవాలయ యాజమాన్యానికి, ప్రసార మాధ్యమాలైన దేశీప్లాజా, రేడియో ఖుషి, టీవీ9, 6టీవీ, టీవీ5, టోరి (తెలుగువన్) వారికి మరియు విందు రెస్టారెంటు యాజమాన్యానికి కృతఙ్ఞతాపూర్వక అభివందనములు తెలియజేసారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు