
శుక్రవారం విడుదల అయిన ‘ప్రతినిధి’ సినిమాకి ప్రజల నుండి వస్తున్న స్పందనతో హీరో నారా రోహిత్ ఆనందంగా ఉన్నారు. ఆనంద్ రవి రాసిన కథకి, ప్రశాంత్ మండవ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో శుభ్ర అయ్యప్ప నారా రోహిత్ సరసన హీరోయిన్ గా నటించింది.
విడుదల ముందు ఎలాంటి ప్రచారం లేకునప్పటికి మంచి కాన్సెప్ట్, పవర్ ఫుల్ డైలాగులతో ప్రేక్షకులు సినిమాని ఆదరిస్తున్నారు. నారా రోహిత్, రాజకీయాలతో విసుగు చెందిన ఒక యువకుడి పాత్రలో అద్భుతమైన నటన కనబరిచాడు. తన నటనకు, తన డైలాగ్ డెలివరీకి విమర్శకుల ప్రశంసలు అందుతున్నాయి.
సాంబశివ రావు నిర్మించిన ‘ప్రతినిధి’కి సాయి కార్తీక్ సంగీతం సమకూర్చారు. నారా రోహిత్ తదుపరి చిత్రం ‘రౌడీ ఫెలో’ ఈ వేసవిలోనే విడుదల కానుంది.

