
యువన్ శంకర్ రాజా దక్షిణాదిన క్వాలిటీ మ్యూజిక్ ని ఇవ్వగలిగిన వారిలో ఒకడు. దాదాపు 100సినిమాలకు పైగా సంగీతాన్ని అందించిన యువన్ సౌత్ లో అందరి హీరోలతోనూ పనిచేసాడు
ఇప్పుడు యువన్ కి ఒక బాలీవుడ్ ఆఫర్ వచ్చిందని సమాచారం. ఇమ్రాన్ హష్మీ తాజా చిత్రం రాజా నట్వర్లాల్ కోసం ఈ యువ సంగీతదర్శకుడిని ఎంచుకున్నారట
ఒక పెద్ద సంగీత దర్శకుడు ప్రాజెక్ట్ నుంచి అనూహ్యంగా తప్పుకుంటే ఆ ఛాన్స్ యువన్ కి వచ్చిందని సమాచారం. దర్శకుడు కునాల్ గతంలో యువన్ పనిచేసిన సినిమాల అవుట్ పుట్ చూసే ఈ అవకాశం ఇచ్చాడట

