‘ఎ’ సర్టిఫికేట్ పొందిన పొగ

‘ఎ’ సర్టిఫికేట్ పొందిన పొగ

Published on Apr 27, 2014 10:00 AM IST

Poga
చాలా కాలంగా విడుదలకి ఆలస్యమవుతున్న సినిమా ‘పొగ’. శంకర్ మార్తాండ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ వారు ఈ సినిమాకి ‘ఎ’ సర్టిఫికేట్ ఇచ్చారు. ఆనంద్ రంగ ఈ సినిమాని నిర్మించాడు.

నవదీప్, మధు శాలిని, రణధీర్, సౌమ్య కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాలోని ఎక్కువ భాగాన్ని హైదరాబాద్ లో షూట్ చేసారు. ‘ఇదే జోనర్ లో వచ్చిన ఎ ఫిలిం బై అరవింద్, కాంచన సినిమాలు సమ్మర్ చివర్లో వచ్చి విజయాన్ని అందుకున్నాయి. ఈ పొగ సినిమా కూడా విజయాన్ని అందుకుంటుందని’ ఆనంద్ రంగ అన్నాడు. మహేష్ శంకర్ ఈ మూవీకి మ్యూజిక్ అందించాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు