
సౌత్ ఇండియన్ టాలెంటెడ్, బిజీ హీరోయిన్స్ ఒకరైన నయనతారని ప్రస్తుతం సూర్య నటించనున్న ఓ సినిమా కోసం సంప్రదింపులు జరుపుతున్నారు. గతంలో సూర్య – నయనతార కలిసి కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో ‘అధవన్'(ఘటికుడు) సినిమాలో నటించారు.
వెంకట్ ప్రభు దర్శకత్వం వహించనున్న ఈ సినిమాని జ్ఞానవేల్ రాజా నిర్మించనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాలో నయనతార నటించనుందని వార్తలు వినిపిస్తున్నాయి కానీ దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ప్రస్తుతం నయనతార తమిళంలో వరుస సినిమా ఆఫర్లతో, మరో వైపు సెట్స్ పై ఉన్న సినిమాలతో బాగా బిజీగా ఉంది.
ఇవన్నీ కాకుండా నయనతార నటించిన ద్వి భాషా చిత్రం ‘అనామిక’ మే 1న రిలీజ్ కానుంది. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమా విద్యాబాలన్ నటించిన ‘కహానీ’ సినిమాకి రీమేక్.

