నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన 97వ సినిమా ‘లెజెండ్’ ఇటీవలే విడుదలై ఘన విజయాన్ని సాధించింది. ఇది విడుదలైన కొద్ది రోజులకే బాలయ్య తన 98వ సినిమా నూతన దర్శకుడు సత్యదేవా తో చేయనున్నాడని అధికారికంగా అనౌన్స్ చేసారు.
ఈ సారి ఎన్నికల్లో హిందూపూర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న బాలకృష్ణ ప్రస్తుతం ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. మాకు అందిన తాజా సమాచారం ప్రకారం బాలయ్య 98వ సినిమాని మే 9న లాంచనంగా ప్రారంభించనున్నారు. అలాగే ఈ సినిమా జూన్ 1 నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది.
ఎస్ఎల్.వి సినిమా బ్యానర్ పై రుద్రపాటి రమణారావు నిర్మించనున్న ఈ సినిమాలో హీరోయిన్, టెక్నికల్ టీం ఎవరు అనేది త్వరలోనే అధికారికంగా తెలియజేయనున్నారు.


