ఏ గడ్డి తినడానికైనా సిద్దపడుతున్న నేటితరం నిర్మాతలు – దాసరి

ఏ గడ్డి తినడానికైనా సిద్దపడుతున్న నేటితరం నిర్మాతలు – దాసరి

Published on Apr 28, 2014 1:53 PM IST

dasari-narayan-rao
ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న సీనియర్ దర్శకుల్లో దర్శకరత్న దాసరి నారాయణరావు ఒకరు. ప్రస్తుతం ఇండస్ట్రీలో జరుగుతున్నా లోపాలను ఎత్తి చూపడంలో ముందుండే వ్యక్తి దాసరి నారాయణరావు. దాసరి తీసిన’తాతా-మనవడు’ సినిమా వచ్చి 41 ఏళ్ళు కావడంతో ఈ చిత్ర నిర్మాత రాఘవని సత్కరించడం కోసం ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దాసరి ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న నిర్మాతలపై సెన్సేషనల్ కామెంట్స్ చేసారు.

‘మొదటి తరం నిర్మాతల ముందు హీరోలు చేతులు కట్టుకొని నిలబడుకునే వారు. ఈ నలభై ఏళ్ళలో నిర్మాతకి అర్థం మారిపోయింది. ప్రస్తుతం క్యాషియర్లు, మీడియేటర్లు ఇప్పుడు నిర్మాతలైపోయారు. ప్రస్తుతం ఉన్న నిర్మాతలు హీరోలకి దాసులైపోతారు. జస్ట్ హీరో డేట్లు ఇస్తే కోట్లు సాధించవచ్చు అనే ఆలోచిస్తున్నారు. దానికోసం ఏ గడ్డి తినడానికైనా సిద్దపడుతున్నారు. ఇప్పుడున్న నిర్మాతలు రాఘవగారిని ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ఇక్కడ ఇండస్ట్రీలేదు, కేవలం ఇండివిడ్యువల్స్ మాత్రమే ఉన్నారని’ అన్నారు.

తాజా వార్తలు