రజనీ కాంత్ చిత్రం లో నటించనున్న జగపతి బాబు

రజనీ కాంత్ చిత్రం లో నటించనున్న జగపతి బాబు

Published on Apr 28, 2014 10:11 PM IST

jagapathi-babu
ఫ్యామిలీ హీరోగా పేరు తెచ్చుకున్న జగపతి బాబు కీలక పాత్రల్లో ఎన్నో చిత్రాల్లో నటించాడు.‘లెజెండ్’ చిత్ర విజయంతో మళ్ళీ విజయాల బాట బట్టిన ఇతను ప్రస్తుతం భారీ బడ్జెట్ చిత్రాల్లో నటిస్తున్నాడు.

తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన జగపతి బాబు నటించే అవకాశాన్ని దక్కించుకున్నారు. ఈ చిత్రంలో జగపతి బాబు ప్రధాన పాత్ర పోషించనున్నట్లు తన సోషల్ నెట్వర్క్ ద్వారా సమాచారాన్ని అందించారు.

కెఎస్ రవి కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం త్వరలోనే షూటింగ్ జరుపుకోనుంది. అనుష్క, సోనాక్షి సిన్హా లు హీరోయిన్లుగా ఈ చిత్రంలో కనిపించనున్నారు. ప్రస్తుతం మంచి డిమాండ్ ఉన్న నటుడుగా పేరు అందించిన ‘లెజెండ్’ చిత్ర బృందానికి అతను ధన్యవాదాలు తెలపవలసి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు