హౌస్ ఫుల్3 లో నటించనున్న కృతి సనన్?

హౌస్ ఫుల్3 లో నటించనున్న కృతి సనన్?

Published on Apr 30, 2014 1:13 AM IST

Kriti-Sanon

బాలీవుడ్ లో కృతిసనన్ నటించిన హీరోపంతి చిత్రం విడుదల కాకముందే ఆమె మరో చిత్రంలో నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఆమె సాజిద్ నదియద్వాల తో చర్చలు జరుపుతున్నట్లు, హౌస్ ఫుల్ 3 లో ప్రధాన పోషించనున్నట్లు తెలుస్తోంది. అక్షయ్ కుమార్, అభిషేక్ బచ్చన్, రితేష్ దేశ్ ముఖ్ లు నటిస్తున్న ఈ ప్రేమ చిత్రానికి సాజిద్ – వాజిద్ లు దర్శకత్వం వహిస్తున్నారు.

జాకీ శ్రోఫ్ కుమారుడు టైగర్ శ్రోఫ్ తో కలిసి కృతి సనన్ నటించిన హీరోపంతి చిత్రం మే 23న విడుదల కానుంది. ప్రస్తుతం ఈ చిత్రాన్ని ప్రమోటింగ్ చేసే పనిలో కృతి బిజీగా ఉన్నారు. తెలుగులో పరుగు చిత్రం ఆధారంగా హిందీ ప్రేక్షకులకు నచ్చే విధంగా కొద్దిపాటి మార్పులతో ఈ చిత్రాన్ని నిర్మించారు. టైగర్ శ్రోఫ్ నటించిన మొదటి సినిమా పై భారీగానే అంచనాలు ఉన్నాయి.

ఈ సంవత్సర ఆరంభంలో మహేష్ బాబు నటించిన 1-నేనొక్కడినే చిత్రంతో కృతి సనన్ తెలుగులో తెర అరగ్రేటం చేసింది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృతి తన నటనతో మంచి పేరు తెచ్చుకుంది. ఆ తరువాత ఆమె తెలుగులో ఏ చిత్రం ఒప్పుకోలేదు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు