రజనీ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించనున్న రత్నవేలు !

రజనీ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించనున్న రత్నవేలు !

Published on May 1, 2014 11:54 AM IST

Ratnavelu

రజనీకాంత్ తన తదుపరి చిత్రం ‘లింగ’ కు రత్నవేలు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించనున్నారు. కేఎస్ రవికుమార్ ఈ చిత్రానికి దర్శకుడు గా వ్యవహరించనున్నారు. సోనాక్షి సిన్హా, అనుష్కలు ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో జగపతి బాబు కూడా ముఖ్య భూమిక పోషించనున్నారు.

ఐశ్వర్య రాయ్, రజనీ కాంత్ జంటగా నటించిన రోబో చిత్రానికి గతంలో సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించిన రత్నవేలు, ఇప్పుడు లింగ సినిమా కు కూడా సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. అయితే రజనీయే స్వయంగా తన టీం లో వచ్చి కలవమని రత్నవేలు చెప్పడం ఆసక్తికర విషయం. గత ఏడు సంవత్సరాల నుంచి తన సొంత సినిమా కు డైరెక్టర్ గా వ్యవహరించాలను కొంటున్నట్లు, అందుకోసం తెలుగు, తమిళంలో వచ్చిన అవకాశాలను కూడా వదులుకున్నట్లు ఆయన తెలిపారు. అయితే రజనీ గారే తనతో కలిసి పని చెయ్యమని చెప్పటంతో తాను కాదనలేక పోయానన్నారు. రజనీతో కలిసి నటించడం తానెంతో గౌరవంగా భావిస్తున్నట్లు రత్నవేలు తెలిపారు. రజనీకాంత్- కేఎస్ రవికుమార్ ల బ్లాక్ బస్టర్ చిత్రం నరసింహ లానే, పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా లింగ చిత్రం రానుంది. ఈ చిత్రం కోసం ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్నట్లు రజనీకాంత్ కూడా తెలిపారు.

ఈ నెలలో ఈ సినిమా కు సంబంధించిన మొదటి షెడ్యూల్ మైసూరులో ఆరంభం కానుంది. ఆ తరువాత హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీ లో షూటింగ్ జరపనున్నారు. రత్నవేలు ఇటీవలే మహేష్ బాబు నటించిన 1-నేనొక్కడినే చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించి ప్రతిఒక్కరినుంచి విమర్శలు ఎదుర్కొన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు