జూన్ చివరి నుంచి నాగ చైతన్య కొత్త మూవీ

జూన్ చివరి నుంచి నాగ చైతన్య కొత్త మూవీ

Published on May 2, 2014 3:06 PM IST

naga-chaitayna
అక్కినేని వారసుడు నాగ చైతన్య ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసిన అక్కినేని ఫ్యామిలీ హీరోస్ చేసిన ‘మనం’ సినిమా మే 23న రిలీజ్ కానుంది. ప్రస్తుతం ‘ఒక లైలా కోసం’ షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు.

ఇది కాకుండా మరో కొత్త సినిమాని పట్టాలెక్కించడానికి నాగ చైతన్య సిద్దమయ్యాడు. నాగ చైతన్య ‘స్వామి రారా’ డైరెక్టర్ సుధీర్ వర్మతో ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమా జూన్ చివరి నుంచి సెట్స్ పైకి తీసుకెళ్ళడానికి రంగం సిద్దం చేస్తున్నారు. బివిఎస్ఎస్ ప్రసాద్ నిర్మించనున్న ఈ సినిమాకి సన్నీ ఎంఆర్ సంగీతం అందించనున్నాడు.

అలాగే ఈ మూవీలో నాగ చైతన్య సరసన హీరోయిన్ కోసం ‘1-నేనొక్కడినే’ ఫేం కృతి సనన్ తో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. కానీ ఈ విషయాలపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇవన్నీ కాకుండా నాగ చైతన్య నటించిన ‘ఆటోనగర్ సూర్య’ విడుదల కావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు