రాజశేఖర్ ప్రధాన పాత్రగా ప్రారంభం కానున్న ‘గడ్డం గ్యాంగ్’

రాజశేఖర్ ప్రధాన పాత్రగా ప్రారంభం కానున్న ‘గడ్డం గ్యాంగ్’

Published on May 2, 2014 11:26 PM IST

Gaddam-Gang
రాజశేఖర్ తన తదుపరి చిత్రం గడ్డం గ్యాంగ్ మే 12 నుంచి ప్రారంభం కానుంది. జర్నీ చిత్ర దర్శకుడు శరవనన్ దగ్గర పని చేసిన సంతోష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నాయి.

తమిళం లో వచ్చిన సూదు కవ్వుం అనే చిత్రం ఆధారంగా కొద్దిపాటి మార్పులతో తెలుగులో గడ్డం గ్యాంగ్ రానుంది. ఈ చిత్రంలో కిడ్నాపర్ గ్యాంగ్ కు హెడ్ గా రాజశేఖర్ వ్యవహరించనున్నారు. రాజశేఖర్ ఈ రోజు మీడియా తో మాట్లాడుతూ ఈ చిత్రాన్ని 40 రోజులలో పూర్తి చెయ్యాలని అనుకుంటున్నట్లు తెలిపారు. అలాగే భవిష్యత్తులో చాలా పాత్రలు చేయనున్నట్లు, ఇది తనకు ఆరంభం మాత్రమే అని తెలిపారు.

అచ్చు సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో అంజలి లావనియ హీరోయిన్ గా నటిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు