కొత్త జంటతో ప్రసంశలు అందుకొంటున్న రెజినా

కొత్త జంటతో ప్రసంశలు అందుకొంటున్న రెజినా

Published on May 3, 2014 12:12 AM IST

Regina
కొత్తజంట విడుదల అయిన తరువాత రెజినా చాలా సంతోషంగా కనిపిస్తోంది. ఈ చిత్రంలో నటనకు గాను ఆమె పలువురి నుంచి ప్రసంశలు అందుకుంటోంది. ఈ చిత్రంలో కీలకంగా వ్యవహరించిన రెజినా గురించి పలువురు మాట్లాడుకుంటున్నారు.

ఇంతక ముందే రెజినా తన నటనతో ఆకట్టుకున్నప్పటికీ, పెద్ద బ్యానర్ పై నటించడం బహుశా ఇదే మొదటి సారి అయి ఉండవచ్చు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై గుర్తింపు పొందిన రెజినా, ఇప్పుడు మిగిలిన మెగా హీరోలతో నటించే అవకాశం ఉంది.

ఇప్పటికే రెజినా కు పలు మంచి ఆఫర్లు వస్తున్నప్పటికీ, సరైన నిర్ణయాలు తీసుకోవటం లో ఆమె కొంత సమయం తీసుకుంటున్నట్లు సమాచారం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు