సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న గ్లోబల్ అడ్వెంచర్ ‘వారణాసి’ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను సరిగ్గా ఏడాది తర్వాత, అంటే ఏప్రిల్ 7, 2027న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా “మేము ఒక సంవత్సరం ముందుకు ప్రయాణిస్తే, అది షో టైమ్ అవుతుంది” అంటూ రిలీజ్ చేసిన మెసేజ్ సోషల్ మీడియాలో విపరీతమైన హైప్‌ను క్రియేట్ చేస్తోంది.
ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి కూడా తన వంతుగా ‘365’ అని పోస్ట్ చేయడంతో అభిమానుల ఉత్సాహం రెట్టింపైంది. దీనికి కొనసాగింపుగా నిర్మాత ఎస్.ఎస్. కార్తికేయ, కీరవాణి మధ్య జరిగిన సరదా సంభాషణలో మొదటి పాట ఎప్పుడు వస్తుందని అడగడం సినిమా మ్యూజికల్ అప్‌డేట్‌పై ఆశలు పెంచింది. అంతేకాకుండా, సినిమా అధికారిక ఎక్స్ హ్యాండిల్ లో సెట్స్ గురించి చేసిన ఫన్నీ పోస్ట్ చూస్తుంటే షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని అర్థమవుతోంది.
శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కె.ఎల్. నారాయణ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రంలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దాదాపు 1300 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ గ్లోబ్ ట్రాటింగ్ ఎపిక్ ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోంది.


