
దర్శకరత్న దాసరి నారాయణ రావుగారు సాధారణంగా ఏ కొత్త దర్శకులను పొగడరు. చాలా సందర్బాలలో అయన కొత్తవారి పై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు, అవి వివాదాస్పదం కూడా అయ్యాయి. అయితే తాజాగా రాజమౌళిని అయన పొగడడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు.
ఇటివల ఒక మీడియా సమావేశంలో దాసరి మాట్లాడుతూ, ‘కేవలం ఒక రాజమౌళి మాత్రమే భిన్నమైన సినిమాలు తీస్తున్నారని, మిగతా వారందరు పాత సూత్రాలనే అవలంబిస్తున్నారని, కొత్తవి చేయడానికి ప్రయత్నాలు కూడా చేయడం లేదని అన్నారు. రాజమౌళి టెక్నాలజీని, గ్రాఫిక్స్ ని అధ్బుతంగా వాడుతున్నాడు, అదే ఒక దర్శకుడి గొప్ప లక్షణం’ అని దాసరి రాజమౌళిపై పొగడ్తల వర్షం కురిపించారు. అయన ప్రతిభకు ‘ఈగ’ ‘మగధీర’లాంటి సినిమాలే నిదర్శనం అని అయన అన్నారు.
ఈ సందర్బంగా అయన ఇండస్ట్రీ గురించి మాట్లాడుతూ, ఇండస్ట్రీలోని అన్ని సమస్యలు తీర్చుకోడానికి అందరూ కలిసి పనిచేయాలని, ఎలాంటి సినిమాలు తియలనేధనిపై విశ్లేషణ చేసుకోవాలని అన్నారు. స్క్రిప్ట్ పై శ్రద్ధ పెట్టి, బడ్జెట్ విషయంలో నియంత్రణతో సినిమాలు తీస్తే, బ్లాక్ బస్టర్ సినిమాలు అయ్యే సత్తా మన సినిమాలకు ఉందని దాసరి అభిప్రాయపడ్డారు.

