‘పట్ట పగలు’తో రాజశేఖర్ సక్సెస్ సాధిస్తాడా?

‘పట్ట పగలు’తో రాజశేఖర్ సక్సెస్ సాధిస్తాడా?

Published on May 4, 2014 4:45 PM IST

rajasekhar
డా. రాజశేఖర్ ప్రధాన పాత్రలో నటించిన ‘పట్ట పగలు’ సినిమా జూన్ 6న విడుదల కావడానికి సిద్దమవుతోంది. విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ఈ హర్రర్ థ్రిల్లర్ లో స్వాతి దీక్షిత్ రాజశేఖర్ కూతురి పాత్రలో నటించింది. రాజశేఖర్ బాక్స్ ఆఫీసు వద్ద సక్సెస్ అందుకొని చాలా కాలం అయ్యింది. దాంతో ఈ సినిమాపైనే తన ఆశలు పెట్టుకున్నాడు.

రామ్ గోపాల్ వర్మకి కూడా సరైన సక్సెస్ లేదు. అలాగే వర్మ గతంలో హర్రర్ జోనర్ లో చేసిన సినిమాలు సక్సెస్ అయ్యాయి. మరి ఈ సినిమాతో వర్మ ఆ సక్సెస్ ని రీప్ట్ చేస్తాడా? రాజశేఖర్ కి సక్సెస్ వస్తుందా? అనేది చూడాలి. ఇప్పటికే ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి.

ఈ సినిమా గురించి రాజశేఖర్ మీడియాతో మాట్లాడుతూ ‘గత సంవత్సరంలో నేను వర్మ, పూరి జగన్నాధ్, తమిళ నటుడు విజయ్ హైదరాబాద్ లోని ఓ హోటల్ లో కలిసాం. అప్పుడే వర్మ ఏను కలిసి పనిచేయాలనుకున్నాం. ముందుగా నా చుట్టూ తిరిగే కథ అనుకున్నాం, కానీ తర్వాత మార్చేసాం. ఈ సినిమా మొత్తం దెయ్యం పట్టిన ఒక అమ్మాయి చుట్టూ తిరుగుతుంది. తనని మామూలు మనిషిని చేయడానికి నేను ప్రయత్నిస్తుంటానని’ అన్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు