
అక్కినేని ఫ్యామిలీ హీరోలు అంతా కలిసి నటిస్తున్న ‘మనం’ సినిమా మే 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. అక్కినేని మూడు తరాల హీరోలైన ఎఎన్ఆర్, నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించిన ఈ సినిమాలో అక్కినేని అఖిల్ కూడా అతిధి పాత్రలో కనిపించనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇది పక్కన పెడితే అక్కినేని అఖిల్ ఈ సినిమా రిలీజ్ కోసం ఎంతో ఆసక్తిగా ఉన్నాడని తెలుస్తోంది.
‘మనం సినిమా పిచ్చిలో ఉంటున్నాను. ఒక్కటి మాత్రం కచ్చితంగా చెప్పగలను. అదే ఎఎన్ఆర్ మనంతో అందరి మనసులోనూ నిలిచిపోతారు. ఈ 23 నుంచి ఆనందంగా సాగే లాంగ్ రైడ్ మొదలవుతుందని భావిస్తున్నానని’ అఖిల్ ట్విట్టర్ లో పేర్కొన్నాడు.
సమంత, శ్రియ సరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బాద్షా అమితాబ్ బచ్చన్ అతిధి పాత్రలో కనిపించనున్నాడు.

