జూన్ మధ్యలో విడుదలకానున్న గీతాంజలి

జూన్ మధ్యలో విడుదలకానున్న గీతాంజలి

Published on May 14, 2014 12:19 AM IST

Anjali
అంజలి హీరోయిన్ గా నటిస్తున్న గీతాంజలి సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతూ దాదాపు 80శాతం చిత్రీకరణ పూర్తిచేసుకుంది. రాజ్ కిరణ్ దర్శకుడు.ఎం.వి.వి సత్యనారాయణ నిర్మాత. కోనా వెంకట్ సమర్పకుడు

ఈ సినిమా గురించి కోనా వెంకట్ మాట్లాడుతూ “గీతాంజలి అంజలి కెరీర్ లో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. అనుష్క కెరీర్ లో అరుంధతి సినిమాలో నిలిచిపోతుంది. హర్రర్ కామెడి నేపధ్యంలో సాగుతున్న ఈ సినిమాలో కడుపుబ్బా నవ్వుకునే సన్నివేశాలు పుష్కలంగా వున్నాయి. జూన్ మధ్యలో ఈ సినిమా విడుదలకానుంది” అని తెలిపారు

హర్షవర్ధన్ రానే ఈ సినిమాలో ముఖ్యపాత్ర పోషిస్తున్నాడు. శ్రీనివాస్ రెడ్డి ప్రధాన పాత్రధారి. బ్రహ్మానందం, ధనరాజ్ లు కామెడి బాధ్యతలు స్వీకరిస్తున్నారు. సాయి శ్రీరాం సినిమాటోగ్రాఫర్

తాజా వార్తలు