‘మనం’ లో అతిధి పాత్ర పోషిస్తున్న లావణ్య

‘మనం’ లో అతిధి పాత్ర పోషిస్తున్న లావణ్య

Published on May 15, 2014 1:51 AM IST

Lavanya-Tripathi

‘అందాల రాక్షసి’ ఫేం లావణ్య త్రిపాటి ఎ.యెన్.ఆర్ నాగార్జున నాగ చైతన్య నటించిన ‘మనం’లో అతిధి పాత్ర లో కనపడనుంది. విక్రం కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నాగార్జున కుటుంబం నిర్మించింది. ‘మనం’ మే 23 న భారీ విడుదలకు సిద్ధం అయింది.

ఇప్పటి వరకు ‘మనం’ చిత్రం లో అమితాబ్ బచ్చన్, రాశి ఖన్నా, నీతు చంద్ర మాత్రమే వున్నారని తెలిసిన వారందరికీ కొత్తగా విడుదల చేసిన కనులను తాకే వీడియో సాంగ్ లో లావణ్య తల్లుక్కుమనడం అందరిని ఆశ్చర్యపరిచింది. “అవును నేను ‘మనం’ లో అతిధి పాత్ర చేసాను. విక్రం గారు నన్ను అడిగారు నేను అవును అన్నాను. ‘మనం’ టీం తో పనిచేయడం ఎంతో ఆనందం గా వుంది.” అని లావణ్య ట్విట్టర్ లో పేర్కొంది. అనుప్ రుబెన్స్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

‘అందాల రాక్షసి’ మరియు మంచు విష్ణు తో కలసి ‘దూసుకెళ్తా’ తర్వాత తమిళ్ లో శశి కుమార్ దర్శకత్వం లో వచ్చిన ‘బ్రాహ్మన్’ చిత్రం తో అరంగేట్రం చేసింది. లావణ్య తెలుగు లో పూర్తి నిడివి పాత్ర ఎప్పుడు చేయనుందో వేచి చూడాలి.

తాజా వార్తలు