తుది దశలో ఉన్న ‘ఒక లైలా కోసం’ సినిమా షూటింగ్

తుది దశలో ఉన్న ‘ఒక లైలా కోసం’ సినిమా షూటింగ్

Published on Jun 3, 2014 5:55 PM IST

naga-chaitanya
నాగ చైతన్య హీరోగా తెరకెక్కుతున్న ‘ఒక లైలా కోసం’ సినిమా తుది దశకు చేరుకుంది. తాజా సమాచారం మేరకు విదేశాలలో చిత్రీకరించాల్సిన ఒక పాట మినహా మీగత షూటింగ్ పూర్తయిందని తెలుస్తోంది. ‘గుండె జారి గల్లంతయ్యింది’ సినిమా డైరెక్టర్ విజయ్ కుమార్ కొండ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తుండగా, అనూప్ రూబెన్స్ సంగీతం సమకూరుస్తున్నాడు.

‘మనం’ సినిమాలో తన నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకున్న నాగ చైతన్య ప్రస్తుతం మంచి ఫార్మ్ లో ఉన్నాడు. దర్శకుడు విజయ్ కుమార్ మరియు హీరో నాగ చైతన్య లకు ఈ సినిమా తమ కెరీర్ లో మంచి సినిమా కావాలని ఆశిద్దాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు