
మెగా స్టార్ చిరంజీవి తన 150వ సినిమా తీయబోతున్నారనే వార్తలు రోజు రోజుకి ఆసక్తిని రేపుతున్నాయి. ఈ సినిమాను డైరెక్ట్ చేసే దర్శకుల పేర్లపై, నిర్మాతల పేర్లపై చాలా ఉహాగానాలు వస్తున్నాయి.
అయితే తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాకు ప్రస్తుతం మంచి ఫార్మ్ లో ఉన్న బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నారని తెలుస్తోంది. కానీ కొన్ని రోజుల ముందు వరకు చిరు 150వ సినిమాకి వి.వి.వినాయక దర్శకుడిగా పనిచేస్తాడని వార్తలు వచ్చాయి. ఈ ఇద్దరు పెద్ద దర్శకుల పేర్లు వినిపడడంతో ఎవరు చేస్తారా అనే ఆసక్తి పెరిగిపోతుంది.
‘లెజెండ్’ సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ ఇచ్చిన బోయపాటి, చిరు సినిమాకి దర్శకత్వం వహిస్తే మెగా స్టార్ మంచి పవర్ ఫుల్ రోల్ లో కనిపిస్తారని అభిమానులు ఆశతో ఉన్నారు.

