పంచ్ డైలాగ్ పై క్లారిటీ ఇచ్చిన మహేష్ బాబు

పంచ్ డైలాగ్ పై క్లారిటీ ఇచ్చిన మహేష్ బాబు

Published on Jun 5, 2014 4:15 PM IST

mahesh
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సినిమా ‘ఆగడు’. ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ని మే 31 న సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే కానుకగా రిలీజ్ చేసారు. ఈ టీజర్ లో ‘ప్రతి వోడు పులులు, సింహాలు, ఏనుగులు, ఎలకలతో ఎదవ కంపారిజన్ యలపరం వచ్చేస్తోంది’ అని చెప్పిన డైలాగ్ కాస్త వివాదానికి గురైంది.

ఈ వివాదంపై మీడియా వారు అడగడంతో మహేష్ బాబు స్పందించాడు. టీజర్ లో ఉన్న డైలాగ్ ఏ హీరోలని ఉద్దేశించినది కాదని.. ఆగడు సినిమా కథకి, అందులోని పోలీస్ పాత్ర బిహేవియర్ వాళ్ళ ఆ డైలాగ్ పెట్టామని తెలిపాడు. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది.

తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో శృతి హాసన్ ఓ ఐటెం సాంగ్ లో కనిపించనుంది. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వారు ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు