‘మనం’లో మరికొన్ని ఎఎన్ఆర్ సీన్స్ కలపనున్నారా.?

‘మనం’లో మరికొన్ని ఎఎన్ఆర్ సీన్స్ కలపనున్నారా.?

Published on Jun 8, 2014 9:30 PM IST

Manam_Review
అక్కినేని ఫ్యామిలీ హీరోలు అంతా కలిసి చేసిన ‘మనం’ సినిమా ఈ సంవత్సరం బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచిపోయింది. చిన్న పిల్లలు, యువత, పెద్దలు అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్న ఈ సినిమా అన్ని ఏరియాల్లో విజయవంతంగా ప్రదర్శించబడుతోంది.

మేము విన్న వార్తల ప్రకారం ఈ సినిమా మంచి విజయం సాధించడం వల్ల మరికొన్ని సీన్స్ ని కలపడానికి ఈ చిత్ర టీం ప్లాన్ చేస్తోంది. అది కూడా ఎఎన్ఆర్ చుట్టూ అల్లుకున్న సన్నివేశాలే కలపాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ విషయాన్నీ త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని అక్కినేని ఫ్యామిలీ నిమించింది. ఎఎన్ఆర్ నటించిన చివరి సినిమా కావడం, అఖిల్ ఎంట్రీ ఈ సినిమా భారీ విజయానికి మరింత దోహద పడ్డాయి.

తాజా వార్తలు