పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమానే ఉస్తాద్ భగత్ సింగ్. ఈ వేసవిలో గబ్బర్ సింగ్ తరహా మ్యాజిక్ చేస్తుంది అని అంతా అనుకున్నారు కానీ ఈ సినిమా ఊహించని ఫలితాన్ని అందుకోవాల్సి వచ్చింది. ఇక ఈ సినిమా థియేటర్స్ తర్వాత ఓటిటిలో ఎంట్రీ ఇచ్చింది. దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ రిలీజ్ కి తీసుకొచ్చిన ఈ సినిమా ఓటిటిలో మాత్రం మంచి రెస్పాన్స్ అందుకుంది.
రీసెంట్ గానే గ్లోబల్ లెవెల్లో ఈ సినిమా పలు దేశాల్లో టాప్ లో ట్రెండ్ అవుతుంది అని తెలిపాము. లేటెస్ట్ గా నెట్ ఫ్లిక్స్ వారే గ్లోబల్ లెవెల్లో ఈ సినిమా ట్రెండ్ అవుతున్నట్టు రివీల్ చేశారు. సో ఓటిటిలో మాత్రం ఉస్తాద్ భగత్ సింగ్ కి సాలిడ్ రెస్పాన్స్ దక్కినట్టే అని చెప్పాలి. ఇక ఈ సినిమాలో పవన్ సరసన శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్స్ గా నటించగా దేవిశ్రీ ప్రసాద్, థమన్ లు సంగీతం అందించగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించారు.
When Ustaad is on duty the whole world watches 😎🔥#UstaadBhagatSinghOnNetflix pic.twitter.com/eG4UHDQPyE
— Netflix India South (@Netflix_INSouth) April 23, 2026


