‘ఓ మై గాడ్’ రీమేక్ లో పవన్ కన్పించేది ఎంతసేపు?

‘ఓ మై గాడ్’ రీమేక్ లో పవన్ కన్పించేది ఎంతసేపు?

Published on Jun 9, 2014 10:38 PM IST

Gopala_Gopala_Movie Openin
వెంకటేష్ నటిస్తున్న ‘గోపాల గోపాల’ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక ముఖ్య పాత్ర పోషించనున్నాడు. ఈ సినిమా ఈరోజే అట్టహాసంగా ప్రారంభమయ్యింది. మాకందిన సమాచారం ప్రకారం ఈ సినిమాలో పవన్ 30నిముషాలు నిడివిగల పాత్రపోషించనున్నాడు

ఈ సినిమా ఒరిజినల్ వెర్షన్ ‘ఓ మై గాడ్’ లో అక్షయ్ కుమార్ పాత్ర నిడివికంటే ఇది ఎక్కువే అయినా పవన్ ఇటువంటి షార్ట్ మరియు స్వీట్ రోల్ చెయ్యడం ఇదే తొలిసారి కనుక పవన్ అభిమానులు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి

ఈ సినిమాలో వెంకటేష్ సరసన శ్రేయ నటిస్తుంది. పవన్ కి హీరోయిన్ వుండదు. డాలీ దర్శకుడు. సురేష్ బాబు మరియు శరత్ మరార్ లు ఈ సోషియో ఫ్యాంటసీ మూవీని నిర్మిస్తున్నారు

తాజా వార్తలు