అధ్బుతమైన నటి శకుంతల

అధ్బుతమైన నటి శకుంతల

Published on Jun 14, 2014 6:43 PM IST

Shakuntala
చిత్ర పరిశ్రమ అభిమానులు అలాగే ఎంతో మంది శ్రేయోభిలాషులు తన 35 యేళ్ల కెరీర్ లో ఎంతోమంది హృదయాలలో చోటు సంపాదించిన ‘తెలంగాణా’ శకుంతలకి కన్నిటీ వీడ్కోలు పలికారు. తెరమీద విలన్ గా కమెడియన్ గా అలరించిన శకుంతల తను ఒక అబ్బాయిలా పెరిగానని తన తల్లి ఆమెకు చొక్కాలు ఫాంట్లు వేయడంతో పాటు తల కి నూనె పెట్టి గట్టిగా జడ వేసి తరచుగా ‘మా అబ్బాయి’ అనేవారని తెలిపారు .

శకుంతల ఓసారి మాట్లాడుతూ తను ఎప్పుడు బొమ్మలకి బదులు కబ్బడి గిల్లిదండా ఆడేవారని అబ్బాయిలు ఆమె కాన్ఫిడెన్స్ కి బయపడి తన తల్లి కి ఫిర్యాదు ఇచ్చేవారని తెలిపారు. శకుంతల కి కొడుకుతో పాటు కూతుర్లు కూడా వున్నారు. అయితే తన కూతుర్లని తనలాగే పెంచారు.

తన కూతురు తమ నివాసం ఉంటున్న కాలనీ ప్రెసిడెంట్ అని దానికి సంబంధించిన అన్ని విషయాలు ఎంతో చాకచక్యంగా నిర్వత్తిస్తుందని ఎంతో గర్వంగా ఓసారి చెప్పారు. అయితే తన భర్త తనని నాటకరంగం లో ఎంతగానో ప్రోత్సాహించారు అనే చెప్పేవారు అయితే సినిమాలలో విజయం పొందాక ఆమె భర్త తన కెరీర్ కి ఫుల్ స్టాప్ పెట్టమని అనేవారని కూడా తెలిపారు.

శకుంతల ఎటువంటి పరిస్థితిలోను తన అభిమాననికే పెద్ద పీట వేసేవారు. తనని పనిమానేసి ఇంట్లో ఉండమన్న పని చేయకుండా ఆపేసిన తను సినిమాలలో పేరు గడించిన నటన అనేది ఒక కళ అదొక బహుమతి అని నమ్మేవారు. మహారాష్ట్ర కి చెందిన శకుంతలకి రాష్ర విభజన అస్సలు ఇష్టం వుండేది కాదు. అయితే ఆమెను ‘తెలంగాణా’ శకుంతల అనడం యాదృచ్చికం.

తాజా వార్తలు