
చాలా నెలల నుండి వాయిదా పడుతూ వస్తున్న ‘ఆటోనగర్ సూర్య’ మళ్ళి తెరపైకి వచ్చింది. ఈ సినిమా ఈనెల 27న విడుదల అవుతుందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే పలు మార్లు వాయిదా పడిన ఈ సినిమా ఈసారి కూడా వాయిదా పడుతుందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
అయితే ఈ అనుమానాలు అన్ని తీర్చడానికి, ‘ఆటోనగర్ సూర్య’ సినిమాపై ఒక వివరణ ఇవ్వడానికి కింగ్ అక్కినేని నాగార్జున గురువారం అన్నపూర్ణ స్టూడియోస్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఈ సినిమా విశేషాలు, సినిమా విడుదల గురించి నాగార్జున గారు మాట్లాడుతారని సమాచారం. ఈ సినిమాను విడుదల చేయడానికి స్వయంగా నాగార్జున రంగంలోకి దిగాడని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.
నాగ చైతన్య, సమంత హీరో హీరోయిన్ లుగా నటిస్తున్న ఈ సినిమాకు దేవ కట్ట దర్శకత్వం వహిస్తున్నాడు. అనూప్ రుబెన్స్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమాను అర్.అర్. మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది.

