మణిరత్నం సినిమాలో సాయి పల్లవి, విజయ్ సేతుపతి.. షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అంటే..?

మణిరత్నం సినిమాలో సాయి పల్లవి, విజయ్ సేతుపతి.. షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అంటే..?

Published on Apr 4, 2026 10:22 AM IST

Vijay-Sethupathi,-Sai-Palla

దర్శకుడు మణిరత్నం డైరెక్షన్‌లో వెర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి, స్టార్ బ్యూటీ సాయి పల్లవి కలిసి నటిస్తున్నట్లు వార్తలు వస్తుండటంతో ఈ మూవీపై ఇండస్ట్రీ వర్గాల్లో సాలిడ్ బజ్ క్రియేట్ అయ్యింది. వెండితెరపై ప్రేమకథలకు సరికొత్త నిర్వచనం చెప్పే మణిరత్నం, ఈసారి ఒక విలక్షణమైన రొమాంటిక్ డ్రామాను సిద్ధం చేస్తున్నాడట. మద్రాస్ టాకీస్ మరియు లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్లేందుకు సిద్ధమవుతోంది.

తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా ప్రోమో షూటింగ్‌ను ఈ నెలలోనే పూర్తి చేయాలని చిత్రబృందం భావిస్తోంది. వేసవి కానుకగా జూన్ నెలలో రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది. మణిరత్నం మార్క్ మేకింగ్‌లో విజయ్ సేతుపతి నటన, సాయి పల్లవి సహజత్వం తోడైతే స్క్రీన్ మీద అద్భుతమైన మ్యాజిక్ రిపీట్ అవుతుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

ప్రస్తుతం ఈ ఇద్దరు నటీనటులు తమ ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. తమకున్న బిజీ షెడ్యూల్స్ మధ్యే ఈ ప్రతిష్టాత్మక చిత్రం కోసం వారు సమయాన్ని కేటాయించనున్నారు. ఒక సెన్సిబుల్ డైరెక్టర్ తో ఈ ఇద్దరు టాలెంటెడ్ యాక్టర్స్ జతకట్టడం ఈ ప్రాజెక్ట్ కు అతిపెద్ద ఆకర్షణగా నిలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు