ట్రైలర్ టాక్ : ప్రేమ, నమ్మకద్రోహం, విధ్వంసం.. ‘డెకాయిట్’ సాలిడ్ ట్రీట్ ఖాయం..!

ట్రైలర్ టాక్ : ప్రేమ, నమ్మకద్రోహం, విధ్వంసం.. ‘డెకాయిట్’ సాలిడ్ ట్రీట్ ఖాయం..!

Published on Apr 4, 2026 3:44 PM IST

Dacoit

అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా చిత్రం ‘డెకాయిట్’ థియేట్రికల్ ట్రైలర్ తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్. యాక్షన్ అండ్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రానికి షానీల్ డియో దర్శకత్వం వహించాడు. ‘క్షణం’, ‘గూఢచారి’ వంటి సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అడివి శేష్, ఈసారి పూర్తి భిన్నమైన లవ్ స్టోరీ కమ్ యాక్షన్ కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

ఇక తాజాగా రిలీజ్ అయిన ఈ ట్రైలర్ గమనిస్తే.. హరి (అడివి శేష్), జూలియట్ (మృణాల్ ఠాకూర్)ల మధ్య గాఢమైన ప్రేమ.. అది నమ్మకద్రోహం గా మారి విడిపోవడం.. మళ్లీ వారు ఒక క్లిష్ట పరిస్థితిలో కలుసుకోవడం.. తిరిగి వారు నేర ప్రపంచంలోకి అడుగు పెట్టడం వంటి సన్నివేశాలు ఈ సినిమాపై ఉత్కంఠను పెంచుతున్నాయి. ముఖ్యంగా అడివి శేష్ మేకోవర్ మరియు మృణాల్ ఠాకూర్ నటన హైలైట్‌గా నిలిచాయి.

ఈ చిత్రంలో బాలీవుడ్ డైరెక్టర్ కమ్ యాక్టర్ అనురాగ్ కశ్యప్ కీలక పాత్రలో నటించడం విశేషం. ఆయనతో పాటు ప్రకాష్ రాజ్, సునీల్ వంటి స్టార్స్ ఈ సినిమాలో నటిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ట్రైలర్‌లో కనిపించిన విజువల్స్ మరియు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చూస్తుంటే, అడివి శేష్ ఖాతాలో మరో బ్లాక్‌బస్టర్ ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు