తమిళంలో భారీ ప్రాజెక్ట్ ని సొంతం చేసుకున్న దేవి శ్రీప్రసాద్

తమిళంలో భారీ ప్రాజెక్ట్ ని సొంతం చేసుకున్న దేవి శ్రీప్రసాద్

Published on Jun 28, 2014 5:52 PM IST

DSP
తమిళ సినిమా రంగంలో దేవిశ్రీ ప్రసాద్ మంచి అవకాశాన్ని అందుకున్నాడు. ఈ సంగీత కెరటం తన తదుపరి సినిమాకు విజయ్ తో కలిసి పనిచేయనున్నాడు. ఈ సినిమాకు చింబుదేవన్ దర్శకుడు
అత్తారింటికి దారేది సినిమా విజయం దేవీకి మరిన్ని అవకాశాలు తెచ్చిపెట్టింది. ఇప్పటికే మన DSP సూర్య, అజిత్, కమల్ హాసన్ ల సినిమాలకు కలిసి పనిచేసాడు
తనకి ఇంతమంచి అవకాశాన్ని అందించిన విజయ్ కి మన మల్టీ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ ధన్యవాదాలు తెలిపాడు. 2005లో విజయ్ తో కలిసి పనిచేశాడు. ఈ తాజా సినిమాలో విజయ్ ద్విపాత్రాభినయం చేయనున్నాడు
ఈ సినిమాలో హన్సిక, శృతిహాసన్, సుదీప్ మరియు శ్రీ దేవిలు నటించనున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇంకా ఎటువంటి ప్రకటన అధికారికంగా వెలువడలేదు

తాజా వార్తలు