NBK 111: బాలయ్య క్రేజీ ప్రాజెక్ట్ షురూ..

NBK 111: బాలయ్య క్రేజీ ప్రాజెక్ట్ షురూ..

Published on Apr 20, 2026 10:01 AM IST

NBK-111

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటించిన డివోషనల్ చిత్రం “అఖండ 2” తర్వాత తన కెరీర్ 111వ సినిమాని తన వీరసింహా రెడ్డి దర్శకుడు గోపీచంద్ మలినేనితో చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఎప్పుడో మొదలు కావాల్సిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ కొన్ని మార్పులు చేర్పులు రీత్యా కొద్దిగా ఆలస్యం అయ్యింది. ఇక ఇదిలా ఉండగా ఈ ప్రాజెక్ట్ పై సాలిడ్ అప్డేట్ ఇప్పుడు తెలుస్తుంది. మేకర్స్ నేటి నుంచే ఈ సినిమా తాలూకా షూట్ ని షురూ చేసినట్టు టాక్.

మరి ఈ సినిమా ఎప్పటికి పూర్తయ్యి విడుదలకి తీసుకొస్తారో చూడాలి. ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన మరోసారి నయనతార నటిస్తుండగా సింహా, జై సింహా అలాగే శ్రీరామ రాజ్యం లాంటి సాలిడ్ ట్రాక్ రికార్డు తర్వాత మళ్ళీ వీరు కలిసి నటిస్తుండడంతో ఈ సినిమాపై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ చిత్రానికి కూడా థమన్ సంగీతం అందిస్తుండగా పెద్ది నిర్మాణ సంస్థ వృద్ధి సినిమాస్ వారు భారీ బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.

తాజా వార్తలు