నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. నూతన డైరెక్టర్ సత్యదేవ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలోని కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ ని ప్రస్తుతం బాలకృష్ణపై షూట్ చేస్తున్నారు. మరోసారి బాలకృష్ణ ఈ సినిమాలో పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నాడు.
చాలా రోజుల తర్వాత మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో బాలకృష్ణ సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. బాలకృష్ణ డేట్స్ ఉన్నన్ని రోజులు శరవేగంగా షూటింగ్ చేయనున్నారు. ఈ చిత్ర నిర్మాతలు కూడా ఎమ్మెల్యే గా బాలకృష్ణ తన విధులు నిర్వహిస్తూనే సినిమా షూటింగ్ లో కూడా పాల్గొనేలా ప్లాన్ చేసుకున్నారు. ప్రస్తుతానికి ఈ సినిమాకి ‘గాడ్సే’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు. కానీ ఇంకా ఖరారు కాలేదు.


