
సినీ ప్రపంచంలో ఒక సినిమాని తీయడం కంటే ఆ సినిమాని ప్రజలకు రీచ్ అయ్యేలా పబ్లిసిటీ చేయడం కూడా అంతే ముఖ్యం కానీ ఈ మధ్య చిన్న సినిమాలకు పెద్దగా పబ్లిసిటీ లేక ప్రాచుర్యాన్ని పొందలేకపోతున్నాయి. ఈ కోవలోకి తన సినిమా చేరకూడదు అనే ఉద్దేశంతో ‘ఒక రొమాంటిక్ క్రైమ్ కథ’ ఫేం పి సునీల్ కుమార్ రెడ్డి తన ‘ఒక క్రిమినల్ ప్రేమకథ’ సినిమా కోసం వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు.
ఇప్పటికే తన సినిమా పోస్టర్స్ లో పరదా కట్టుకొని ఉన్న హీరోయిన్ ని టీవీ చానల్స్, మీడియా ముందు కూడా అలానే చూపిస్తూ ప్రచారం చేస్తున్నారు ఇది కాకుండా కొత్తగా టాకింగ్ యాడ్స్ అని వినైల్స్ ని డిజైన్ చేసి వాటిని ఓ పదిమంది కలిసి రోడ్ల మీద ర్యాలీలా వెళుతూ సినిమాని ప్రచారం చేస్తున్నారు. నిన్న హైదరాబాద్ లోని పలు ఏరియాల్లో తిరిగిన ఈ బృందం ఈ రోజు మూవీ లవర్స్ ఎక్కువగా ఉన్న ఆర్టిసి క్రాస్ రోడ్స్ లాంటి ప్రాంతాల్లో ర్యాలీ నిర్వహించనున్నారు. దీనివల్ల సినిమా ప్రజలకి మరింత రీచ్ అయ్యే అవకాశం ఉంది.
మనోజ్, ప్రియాంక, అనిల్, దివ్య ప్రముఖ పాత్రలు పోషించిన ఈ సినిమాని పిసునీల్ కుమార్ రెడ్డి సొంత బ్యానర్ పై నిర్మించారు. జూలై 18న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

